Telangana: తెలుగు అకాడమీ కేసు.. వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం!

  • తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
  • రూ. 92.94 కోట్లను ఏపీకి చెల్లించాలని ఆదేశం
  • 6 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశాలు జారీ
Supreme Court orders Telangana to Pay pending amount to AP in Telugu Academy case

తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా వారం రోజుల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిని ఇచ్చింది. 

ఏపీకి చెల్లించాల్సిన రూ. 92.94 కోట్ల పెండింగ్ సొమ్మును వారంలోగా ఇవ్వాలని చెప్పింది. 6 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది.

More Telugu News