Talasani: టాలీవుడ్ కు పెద్దదిక్కు ఈయనే: తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav says Chiranjeevi is Tollywood head
  • టాలీవుడ్ పెద్దరికంపై చాలా కాలంగా నడుస్తున్న చర్చ
  • తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కును కాదని ఇటీవల చెప్పిన చిరంజీవి
  • చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద దిక్కు అని చెప్పిన తలసాని
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయిన తర్వాత నుంచి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరనే విషయంపై ఎడతెరగని చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో ఐకమత్యం లేకపోవడంతో పెద్దతనాన్ని స్వీకరించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అయితే మెగాస్టార్ చిరంజీవే పెద్ద దిక్కు అని చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే చెప్పారు. దీనిపై చిరంజీవి క్లారిటీ ఇస్తూ... తాను కేవలం సినిమా బిడ్డను మాత్రమేనని... ఇండస్ట్రీకి పెద్ద దిక్కును కాదని స్పష్టం చేశారు. అయితే ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో మాత్రం ఆయన చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు. 

మరోవైపు ఈ అంశంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవే అని చెప్పారు. ఫిలిం జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిలిం జర్నలిస్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
Talasani
TRS
Chiranjeevi
Tollywood
Industry Head

More Telugu News