TRS: సారీ చెప్పిన మ‌హేంద‌ర్ రెడ్డికి షాకిచ్చిన‌ పోలీసులు

police wuthdrawn pilot vehicle totrs mlc mahender reddy
  • తాండూరు సీఐపై మ‌హేంద‌ర్ రెడ్డి బూతుల ప‌ర్వం
  • పోలీసుల‌కు సారీ చెప్పిన మ‌హేంద‌ర్ రెడ్డి
  • అయినా ఆయ‌న‌కు పైల‌ట్ వాహ‌నాన్ని ర‌ద్దు చేసిన పోలీసులు
తాండూరు సీఐపై బూతు పురాణం అందుకుని, ఆపై విచారం వ్య‌క్తం చేస్తూ సారీ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో త‌న‌కున్న విభేదాల నేప‌థ్యంలో...త‌న‌కంటే ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రుల‌కు ప్రాధాన్య‌మిస్తున్నారంటూ తాండూరు టౌన్ సీఐ రాజేంద‌ర్ రెడ్డిని దూషించిన మ‌హేంద‌ర్ రెడ్డి ఆడియో క్లిప్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఘ‌ట‌న‌పై టీఆర్ఎస్ అధిష్ఠానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో సీఐపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌హేంద‌ర్ రెడ్డి గురువారం సాయంత్రం సారీ చెబుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అయితే, మ‌హేంద‌ర్ రెడ్డి సారీ చెప్పినప్పటికీ... పోలీసులు మాత్రం ఆయ‌న‌కు కేటాయించిన పోలీస్‌ పైల‌ట్ వాహ‌నాన్ని ర‌ద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
TRS
MLC
PatnamMhender Reddy
telangana Police

More Telugu News