BJP: దుబ్బాక‌లో మంత్రి హ‌రీశ్ రావు ప‌ర్య‌ట‌న‌... హాజ‌రైన బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

bjp mla raghunandan rao attends harish raos programme in dubbak
  • దుబ్బాక‌లో పీహెచ్‌సీకి శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్ రావు
  • కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు
  • రాజ‌కీయంగా విమ‌ర్శించుకుంటున్నా అభివృద్ది ప‌నుల‌కు క‌లిసి హాజ‌రు
తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు గురువారం సిద్దిపేట జిల్లా ప‌రిధిలోని దుబ్బాక‌లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న హరీశ్ రావు పాల్గొన్న కార్య‌క్ర‌మాల‌కు స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత ర‌ఘునంద‌న్ రావు హాజ‌ర‌య్యారు. నిత్యం రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్న ఇరు పార్టీల‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఇలా అభివృద్ధి ప‌నుల్లో క‌లిసి పాల్గొన‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

దుబ్బాక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం నూత‌న భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు హ‌రీశ్ రావు శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎంపీ హోదాలో మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే హోదాలో ర‌ఘునంద‌న్ రావు హాజ‌ర‌య్యారు.
BJP
Raghunandan Rao
Harish Rao
TRS
Dubbak

More Telugu News