'యశోద' సినిమా నుంచి వచ్చేస్తున్న ఫస్టు గ్లింప్స్

28-04-2022 Thu 19:08
  • సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'యశోద'
  • టైటిల్ రోల్ ను పోషిస్తున్న సమంత
  • మే 5వ తేదీన ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా  ప్రకటన    
  • ఆగస్టు 12 వ తేదీన ఈ సినిమా విడుదల  
Yashoda Movie Update
ఈ మధ్య కాలంలో సమంత నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంటూ వెళుతోంది. ఈ తరహా సినిమాల్లో 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె 'యశోద' సినిమాను చేస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో దర్శకుడిగా హరిశంకర్ పరిచయమవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమా నుంచి మే 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. 

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ .. సంపత్ రాజ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేసిన 'శాకుంతలం' కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.