Srinivas Reddy: 175 సీట్లు గెలవాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి

TDP satire on Jagans comments on winning 175 seats
  • జగన్ గ్రాఫ్ పావలాకు పడిపోయింది
  • 10 సీట్లు కూడా గెలవలేమేమో అనే భయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు
  • వైసీపీకి పదిహేడున్న సీట్లు వచ్చినా ఎక్కువే

2024 ఎన్నికలపై వైసీపీ అప్పుడే దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తమ నేతలకు జగన్ ఎన్నికల కోణంలో మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలను వైసీపీ ఎందుకు గెలవకూడదని జగన్ అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్ప గారి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ... సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని... అలాంటప్పుడు ఆయన పార్టీకి 175 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 10 స్థానాలు కూడా గెలవలేమేమో అనే భయంలో వైసీపీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. 

సీఎం గ్రాఫ్ పావలాకు పడిపోయిందని... రానున్న ఎన్నికల్లో తమకు బీఫామ్ ఇవ్వకపోతే బాగుంటుందని వైసీపీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని చెప్పారు. వైసీపీకి పదిహేడున్నర సీట్లు వచ్చినా ఎక్కువేనని అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని... మాజీ మంత్రులకు ప్రొటోకాల్ కోసమే కొత్త బోర్డులు సృష్టిస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News