Nikhil: సినీ హీరో నిఖిల్ ఇంట విషాదం

Actor Nikhil father passes away
  • నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ మృతి
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామ్
  • నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూత
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 

నిఖిల్ హీరోగా ఎదిగేందుకు ఆయన తండ్రి ఎంతో కృషి చేశారు. కొడుకుని ఎంతో ప్రోత్సహించారు. ఒక సందర్భంలో తన తండ్రిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు నిఖిల్ పరిచయం చేశాడు. మరోవైపు నిఖిల్ తండ్రి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నిఖిల్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
Nikhil
Tollywood
Father
Dead

More Telugu News