Ajay Devgn: కిచ్చా సుదీప్ కి కౌంటర్ ఇచ్చిన అజయ్ దేవగణ్

  • హిందీ ఇకపై జాతీయ భాష కాదన్న సుదీప్
  • హిందీ జాతీయ భాష కానప్పుడు మీ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారన్న అజయ్ 
  • హిందీ ఎప్పటికీ జాతీయ భాషే అని వ్యాఖ్య
Ajay Devgn gives counter to Kiccha Sudeep

సినీ పరిశ్రమలో ఇప్పుడు భాషకు సంబంధించిన యుద్ధం కొనసాగుతోంది. దక్షిణాది సినిమాలు హిందీలోకి డబ్ అయి సూపర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలకు మించి వసూళ్లను రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

'ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్ స్టర్ ఎవర్' సినిమా ప్రారంభోత్సవంలో సుదీప్ మాట్లాడుతూ... బాలీవుడ్ వాళ్లు వారి సినిమాలను తెలుగు, తమిళంలోకి డబ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పారు. మనం మాత్రం ఎక్కడైనా సక్సెస్ అయ్యేలా సినిమాలు తెరకెక్కిస్తున్నామని అన్నారు. 'కేజీఎఫ్ 2' సక్సెస్ గురించి మాట్లాడుతూ, ఇకపై హిందీ జాతీయ భాష కాదని చెప్పారు. 

సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మాట్లాడుతూ, 'మేరే భాయ్ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. అజయ్ చేసిన ట్వీట్ ఇంకెంత చర్చకు దారి తీస్తుందో వేచి చూడాలి.

More Telugu News