Sunrisers Hyderabad: దంచి కొట్టిన హైద‌రాబాద్‌... గుజ‌రాత్ టార్గెట్ ఎంతంటే..!

196 is the target to gujarat titans in ipl match with hyderaba sunrisers
  • 195 ప‌రుగులు చేసిన హైద‌రాబాద్
  • హాఫ్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టిన ఇద్ద‌రు బ్యాట‌ర్లు
  • చివ‌ర‌లో వీర విహారం చేసిన శ‌శాంక్ సింగ్‌
ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో బుధ‌వారం నాడు గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు భారీ స్కోరు చేసింది. గుజ‌రాత్ టాస్ గెల‌వ‌గా.. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్‌కు 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

హైద‌రాబాద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అభిషేక్ శ‌ర్మ ఫోర్లు, సిక్స్‌ల‌తో వీర విహారం చేశాడు. త‌న‌కు జోడిగా వ‌చ్చిన కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (5) స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగినా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా బ్యాటును ఝుళిపించిన అభిషేక్‌.. 42 బంతుల్లో 65 ప‌రుగులు చేశాడు. 

ఆ త‌ర్వాత రాహుల్ త్రిపాఠి (16) నిరాశ‌ప‌ర‌చినా... అయిడెన్ మార్‌క్ర‌మ్ చెల‌రేగిపోయాడు. 40 బంతుల‌ను ఎదుర్కొన్న మార్‌క్ర‌మ్ 56 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఇక చివ‌ర‌లో శ‌శాంక్ సింగ్ ఆరు బంతుల్లోనే 25 ప‌రుగులు రాబ‌ట్టి జ‌ట్టు స్కోరును డ‌బుల్ సెంచ‌రీకి చేరువ చేశాడు. 196 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో మ‌రికాసేప‌ట్లోనే పంజాబ్ త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.
Sunrisers Hyderabad
Gujarat Tutans
IPL 2022

More Telugu News