YSRCP: ఏపీలో జిల్లా అభివృద్ధి మండ‌ళ్లు... పార్టీ జిల్లా అధ్య‌క్షులే వాటికి చైర్మ‌న్లు

ap cm ys jagan comments on district development boards
  • ఏపీలో 26 జిల్లా అభివృద్ధి మండ‌ళ్లు
  • వాటికి వైసీపీ జిల్లా అధ్య‌క్షులే చైర్మ‌న్లు
  • జిల్లా అభివృద్ధి మండ‌ళ్ల చైర్మ‌న్ల‌కు కేబినెట్ హోదా
  • త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులిస్తామ‌న్న జ‌గ‌న్‌
వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నాడు మ‌రో సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం సంద‌ర్భంగా 2024 ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌గ‌న్‌... రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల‌కు 26 జిల్లా అభివృద్ధి మండ‌ళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి జగన్ ప్ర‌క‌టించారు. వాటికి ఆయా జిల్లాల పార్టీ అధ్య‌క్షులే చైర్మ‌న్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా అభివృద్ధి మండ‌ళ్ల చైర్మ‌న్ల‌కు కేబినెట్ హోదా క‌ల్పిస్తామ‌ని కూడా ఆయన చెప్పారు. ఈ నియామ‌కాల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.
YSRCP
YS Jagan
District Development Boards
DDS Chairman

More Telugu News