'దంగల్ ' రికార్డుకి దగ్గరలో 'కేజీఎఫ్ 2'

  • ఈ నెల 14వ తేదీన విడుదలైన 'కేజీఎఫ్ 2'
  • విడుదలైన ప్రతి భాషలో విజయవిహారం 
  • కొత్త రికార్డుల దిశగా దూకుడు 
  • శ్రీనిధి శెట్టికి పెరుగుతున్న అవకాశాలు
KGF 2 Movie Update

భారీ అంచనాల మధ్య విడుదలైన ' కేజీఎఫ్ 2' .. ఆ అంచనాలను దాటుకుని దూసుకుని వెళుతోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తొలి రోజు నుంచే ఈ సినిమా బాలీవుడ్ లో తన దూకుడు చూపుతూ వెళుతోంది. చాలా వేగంగా 100 కోట్లను కొల్లగొట్టిన హిందీ వెర్షన్ అదే ఊపును కొనసాగిస్తోంది. 

హిందీలో ఈ సినిమా ఇప్పటికే 330 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇప్పటివరకూ  'దంగల్' పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా సొంతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. ఆ సినిమా రికార్డు చేరువలోకి ఈ సినిమా వచ్చేసిందని చెబుతున్నారు. ఆ సమయం కోసం యశ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి కథానాయికగా నటించిన శ్రీనిధి శెట్టికి అన్ని భాషల నుంచి అవకాశాలు పెరుగుతున్నాయట. తెలుగు నుంచి కూడా అవకాశాలు వెళుతుండటంతో, తెలుగు భాషను మరింత బాగా నేర్చుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నట్టు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.

More Telugu News