Jignesh Mevani: మ‌హిళా కానిస్టేబుల్‌పై జిగ్నేష్ మేవానీ వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌ట‌

Jignesh Mevani charged with Assault and Molestation on Woman Cop
  • మోదీపై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో మేవానీ తొలి అరెస్ట్‌
  • ఈ కేసులో బెయిల్ ల‌భించ‌గానే ఆయ‌న‌పై రెండో కేసు
  • పోలీసుల అదుపులో ఉండగా మ‌హిళా కానిస్టేబుల్‌ను వేధించారంటూ ఆరోపణ  
గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోప‌ణ‌ల‌తో అస్సాంలోని కోక్రాఝ‌ర్ పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన విష‌యం విదిత‌మే. ఈ కేసులో కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరైన మ‌రుక్ష‌ణమే అస్సాం పోలీసులు కోర్టు బ‌య‌టే ఆయ‌న‌ను మ‌రోమారు అరెస్ట్ చేశారు. ఈ రెండో అరెస్ట్‌కు కార‌ణ‌మేమిట‌న్న విష‌యం తాజాగా వెల్ల‌డైంది.

ఓ మ‌హిళా కానిస్టేబుల్‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌తో అస్సాం పోలీసులు మేవానీపై రెండో కేసు న‌మోదు చేశారు. ఈ కేసులోనే మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాం పోలీసుల అదుపులో ఉండ‌గానే మహిళా కానిస్టేబుల్‌పై మేవానీ వేధింపుల‌కు పాల్పడ్డార‌ట‌.
Jignesh Mevani
Assam
Assam Police

More Telugu News