సచిన్ టెండూల్కర్ కూతురు బాలీవుడ్ అరంగేట్రం!

26-04-2022 Tue 12:26
  • అతి త్వరలోని తెరపై మెరవనున్న సారా
  • నటనలో శిక్షణ తీసుకుందన్న బాలీవుడ్ వర్గాలు
  • అందరినీ కట్టిపడేస్తుందంటూ కామెంట్లు
Sachin Daughter Sara May Entry Into Bollywood Soon
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ బాలీవుడ్ అరంగేట్రానికి సర్వం సిద్ధమైందా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లోనే మోడలింగ్ కెరీర్ లోకి అడుగుపెట్టిన ఆమె..  ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అందాల ఆరబోత విషయంలో డోసు పెంచేసింది. 

త్వరలోనే ఆమె హిందీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతోందని సంబంధిత వర్గాలు 'బాలీవుడ్ లైఫ్' అనే వార్తా సంస్థకు తెలిపాయి. కొన్ని బ్రాండ్లకు ఇప్పటికే ఆమె ప్రకటనల్లో నటించిందని, నటనకు సంబంధించి శిక్షణ కూడా తీసుకుందని పేర్కొన్నాయి. పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉండే సారా.. తన నటనా ప్రతిభతో అందరినీ కట్టిపడేస్తుందని చెప్పాయి. ఆమెకు చాలా ప్రతిభ ఉందని, సారాకు తన తల్లిదండ్రులు ఎంతో మద్దతుగా ఉంటున్నారని తెలిపాయి. కాగా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఇంటర్ వరకు చదివిన సారా.. యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో డిగ్రీ పూర్తి చేసింది.