Sikhar Dhawan: ఒకే మ్యాచ్ లో నాలుగు ఘనతలు సాధించిన ధావన్!

Dhawan owns four achievements in a single match
  • ఐపీఎల్ లో 6 వేలకు పైగా పరుగులు సాధించిన ధావన్
  • ఈ టోర్నీలో 200 మ్యాచ్ లు ఆడిన ఘనత
  • మొత్తం టీ20 క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న ధావన్

పంజాబ్ ఓపెనర్, టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్ లో మరిన్ని ఘనతలను సాధించాడు. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ధావన్ 88 పరుగులు సాధించాడు. తద్వారా ఐపీఎల్ లో తాను చేసిన పరుగులను 6,086కి పెంచుకున్నాడు. ఐపీఎల్ లో 6 వేలకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. తొలి స్థానంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (6,402 పరుగులు) ఉన్నాడు. 

మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్ ధావన్ కు 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్ మెన్ గా ధావన్ నిలిచాడు. అంతేకాదు ఇదే మ్యాచ్ లో కోహ్లీ పేరిట ఉన్న మరో రికార్డును ధావన్ అధిగమించాడు. ధావన్ 9 పరుగులు సాధించిన తర్వాత చెన్నై జట్టుపై ఎక్కువ పరుగులు (1,022) చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. చెన్నైపై 949 పరుగులు చేసిన కోహ్లీ రెండో స్థానానికి వెళ్లాడు. అంతేకాదు మొత్తం టీ20 క్రికెట్లో ధావన్ 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News