Elon Musk: ట్విట్టర్ కొనుగోలు తర్వాత మస్క్ చేసిన మొదటి ట్వీట్ ఇదే

  • ట్విట్టర్ ను మరింత మెరుగ్గా మారుస్తానన్న మస్క్ 
  • కొత్త ఫీచర్లను తీసుకొస్తానని వెల్లడి 
  • అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే వేదికగా ట్విట్టర్ ఉంటుందని వ్యాఖ్య 
first tweet as Twitter owner Elon Musk says he wants to make the platform better than ever

ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల పరంగా మేటి సంస్థ టెస్లా. అంతరిక్ష పరిశోధన, శాటిలైట్ కమ్యూనికేషన్ల సేవల్లో దూసుకుపోతున్న సంస్థ స్పేస్ ఎక్స్. వీటి అధినేత అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను చాలా వేగంగా, అతి స్వల్ప వ్యవధిలోనే తన సొంతం చేసుకున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే వేదికగా ట్విట్టర్ ను అభివృద్ది చేయాలన్నది ఆయన సంకల్పం. 

ట్విట్టర్ లో 8.7 కోట్ల మంది ఎలాన్ మస్క్ ను ఫాలో అవుతుంటారు. కొత్త సాంకేతికతలను ముందుగానే పసిగట్టగల మేధావిగా మస్క్ కు గుర్తింపు ఉంది. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ మొదటి ట్వీట్ పెట్టారు.

‘‘స్వేచ్ఛగా మాట్లాడగలగడం ప్రజాస్వామ్యానికి పునాది. మానవాళి భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అంశాలకు చర్చా వేదికగా ట్విట్టర్ ఉంటుంది. ఇప్పటి కంటే ట్విట్టర్ ను మరింత మెరుగ్గా తయారు చేయడానికి సుముఖంగా ఉన్నాను. కొత్త ఫీచర్లు, విశ్వాసాన్ని పెంచడం కోసం ఆల్గోరిథమ్ లను ఓపెన్ సోర్స్ చేస్తాం. స్పామ్ బాట్లను ఓడిస్తాం. ట్విట్టర్ కు ఎంతో సత్తా ఉంది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ, యూజర్లతో కలసి పనిచేస్తా’’ అంటూ ట్విట్టర్ యజమానిగా ఎలాన్ మస్క్ మొదటి చేశారు. 

More Telugu News