Telangana: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

Telangana corona bulletin
  • తాజాగా 12,776 కరోనా పరీక్షలు
  • 34 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 26 కొత్త కేసులు
  • 15 మందికి కరోనా నయం
  • ఇంకా 232 మందికి చికిత్స 

తెలంగాణలో గత ఒక్కరోజు వ్యవధిలో 12,776 కరోనా పరీక్షలు నిర్వహించగా, 34 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాదులోనే అత్యధికంగా 26 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 15 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 232 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

  • Loading...

More Telugu News