Sikhar Dhawan: ధావన్ ధమాకా... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

  • వాంఖెడేలో పంజాబ్ వర్సెస్ చెన్నై
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 రన్స్
  • 59 బంతుల్లో 88 రన్స్ చేసిన ధావన్
Punjab Kings registers huge total with the help of Dhawan fifty

ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ధావన్ 59 బంతుల్లో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధావన్ స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 

కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (18) అవుటైన తర్వాత... ధావన్ కు భానుక రాజపక్స నుంచి విశేష సహకారం లభించింది. ఎడమచేతివాటం రాజపక్స 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. ఆఖర్లో లియామ్ లివింగ్ స్టోన్ 7 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు.

More Telugu News