'ఆచార్య‌'కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ స‌ర్కారు

  • వారం రోజుల పాటు 5 ఆట‌ల‌కు అనుమ‌తి
  • టికెట్ల రేట్ల‌ను పెంచుకునేందుకూ గ్రీన్ సిగ్న‌ల్‌
  • తెలంగాణ స‌ర్కారు ఉత్త‌ర్వుల జారీ
telangana government good news to acharya movie

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ కలిసి న‌టించిన తాజా చిత్రం 'ఆచార్య' ఈ నెల 29న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కూడా జ‌రిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి మంజూరు చేస్తూ తెలంగాణ స‌ర్కారు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఈ నెల 29న విడుద‌ల కానున్న అచార్య చిత్రాన్ని ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆట‌ల చొప్పున ప్ర‌ద‌ర్శ‌న‌కు వీలుంది. అంతేకాకుండా సినిమా హాళ్ల‌లో ఆయా కేట‌గిరీల‌ను బ‌ట్టి టికెట్ రేట్ల‌ను కూడా పెంచుకునేందుకు కూడా సినిమా థియేట‌ర్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్ర‌మే ఈ పెంపును ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ధ‌ర‌ల‌ను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తించింది.

More Telugu News