KTR: హైదరాబాదులో రూ.246 కోట్లతో ఫెర్రింగ్ ల్యాబరేటరీస్... ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR inaugurates Ferring Laboratories in Hyderabad
  • హైదరాబాదుకు భారీ పెట్టుబడులు
  • ముందుకొచ్చిన స్విట్జర్లాండ్ సంస్థ
  • జీనోమ్ వ్యాలీలో ల్యాబ్ ఏర్పాటు 
స్విట్జర్లాండ్ కు చెందిన సంతానసాఫల్య వైద్యచికిత్స, ప్రసూతి ఆరోగ్య మందుల ఉత్పత్తి సంస్థ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ హైదరాబాదులో కాలుమోపింది. ఇక్కడి జీనోమ్ వ్యాలీలో రూ.246 కోట్లతో స్విస్ సంస్థ తాజా ల్యాబరేటరీని ఏర్పాటు చేసింది. నేడు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ హైదరాబాద్ విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

పునరుత్పాదక ఔషధాల రంగంలోనూ, ప్రసూతి సంబంధిత ఆరోగ్య రంగంలోనూ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ హైదరాబాదులో భారీ పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
KTR
Ferring Laboratories
Genome Valley
Hyderabad
Switzerland
Telangana

More Telugu News