Kajal Aggarwal: 'ఆచార్య'లో కాజల్ పాత్రను పూర్తిగా తొలగించాం: కొరటాల శివ సంచలన ప్రకటన

Kajal Aggarwal is not there in Acharya movie says Koratala Siva
  • ఈ సినిమాలో కాజల్ ది ప్రాధాన్యత లేని పాత్ర
  • తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవుట్ పుట్ సంతృప్తిగా అనిపించలేదు
  • అందుకే ఆమె పాత్రను తొలగించాం
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమాలో కాజల్ పాత్ర ఉందా? లేదా? అనే చర్చకు దర్శకుడు కొరటాల శివ తెరదించారు. ఈ సినిమాలో కాజల్ పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. సరైన ప్రాధాన్యత లేని పాత్రలో హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. 

ఈ చిత్రంలో చిరంజీవి పాత్రకు ప్రేమపై ఆసక్తి ఉండదని... అయితే కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాజల్ పాత్రను చొప్పించడానికి ట్రై చేశానని తెలిపారు. తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూశానని... తనకు సంతృప్తిగా అనిపించలేదని చెప్పారు. 

ఇదే విషయాన్ని చిరంజీవి గారితో చెపితే... కాజల్ పాత్రను ఉంచాలా? వద్దా? అనే విషయాన్ని తనకే వదిలేశారని కొరటాల శివ అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాజల్ కు చెప్పానని... ఆమె నవ్వుతూనే స్పందించిందని చెప్పారు. దీంతో, 'ఆచార్య' నుంచి కాజల్ పాత్రను పూర్తిగా తప్పించామని అన్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిందని చెప్పారు. ఈ చిత్రంలో సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
Kajal Aggarwal
Acharya Movie
Chiranjeevi
Koratala Siva
Tollywood

More Telugu News