Noise: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో తక్కువ ధరకే ‘నాయిస్’ స్మార్ట్ వాచ్

Noise ColorFit Ultra Buzz smartwatch launched in India
  • కలర్ ఫిట్ అల్ట్రా బజ్ విడుదల
  • ధర రూ.3,499
  • 28 నుంచి అమెజాన్ లో విక్రయాలు
  • వాచ్ నుంచే కాలింగ్, మెస్సేజింగ్
నాయిస్ బ్రాండ్ కింద తక్కువ ధరకే ఎన్నో ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ ‘కలర్ ఫిట్ అల్ట్రా బజ్’ విడుదలైంది. దీని ధర రూ.3,499. ఏప్రిల్ 28వ తేదీ నుంచి అమెజాన్ పోర్టల్ పై విక్రయాలు మొదలవుతాయి. చార్ కోల్ బ్లాక్, చాంపేన్ గ్రే, ఆలివ్ గ్రీన్ రంగుల్లో ఈ వాచ్ లభిస్తుంది.

1.75 అంగుళాల డిస్ ప్లే ఈ స్మార్ట్ వాచ్ లో ఉంటుంది. బ్లూటూత్ కు కనెక్ట్ చేసుకుని కాల్ స్వీకరించొచ్చు. స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. ఫోన్ పాకెట్ నుంచి తీయాల్సిన అవసరం ఉండదు. వాచ్ నుంచే కాల్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి పరీక్షించుకునే ప్రాథమిక సదుపాయాలు కూడా ఉన్నాయి. గుండె రేటు, రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్, నిద్ర పర్యవేక్షణ, ఎన్ని అడుగులు నడుస్తున్నారు? ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారా? ఇలాంటి సమాచారం తెలుసుకోవచ్చు.

100 స్పోర్ట్ మోడ్స్ తో ఈ వాచ్ వస్తుందని నాయిస్ అంటోంది. హైకింగ్, సైక్లింగ్, ఇండోర్ క్రీడలు, అవుట్ డోర్ క్రీడలను ఈ వాచ్ మానిటర్ చేస్తుంది. అంతేకాదు, ఫోన్ కు వచ్చిన మెస్సేజ్ లకు రిప్లయ్ ఈ వాచ్ నుంచే ఇచ్చే సదుపాయం కూడా ఉంది. ఇలాంటివే ఇంకా పలు ఫీచర్లున్నట్టు నాయిస్ కంపెనీ తెలిపింది.
Noise
ColorFit Ultra Buzz
smartwatch
launched

More Telugu News