India: ఫ్రాన్స్ అధ్యక్షుడిని స్వయంగా కలసి అభినందించనున్న ప్రధాని!

  • మే 2 నుంచి 6 వరకు ఐరోపాలో ప్రధాని మోదీ పర్యటన
  • పారిస్ లో మెక్రాన్ తో చర్చలు
  • జర్మనీ చాన్స్ లర్ స్కాల్జ్ తోనూ భేటీ
PM Modi to meet President Emmanuel Macron to cement India France ties

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తిరిగి ఎన్నిక కావడం పట్ల ప్రధాని మోదీ ఇప్పటికే ట్విట్టర్ లో అభినందనలు తెలియజేశారు. ఇంతటితో సరిపెట్టకుండా.. నేరుగా మెక్రాన్ ను కలసి అభినందించనున్నారు. ప్రధాని మోదీ మే 2 నుంచి 6వ తేదీ వరకు యూరోప్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ స్కాల్జ్ తో ద్వైపాక్షిక వాణిజ్య సమావేశాల్లో పాల్గొననున్నారు. 

కోపెన్ హెగెన్ లో జరిగే ఇండియా-నార్డిక్ సదస్సును ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సన్నిహిత రాజకీయ, రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయి. నూతన తరం సాంకేతిక టెక్నాలజీలపై కలసి పనిచేసేందుకు రెండు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల తయారీ విషయంలో ఆత్మినిర్భర్ భారత్ కు ఫ్రాన్స్ మద్దతుగా ఉంది.

More Telugu News