CM Jagan: ఈ నెల 27న విజయవాడ, మంగళగిరిలో సీఎం జగన్ పర్యటన

CM Jagan tour in Vijayawada and Mangalagiri
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
  • విజయవాడలో ముస్లిం మతపెద్దలతో భేటీ
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
  • గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ కుమారుడి పెళ్లికి హాజరు
ఏపీ సీఎం జగన్ ఈ నెల 27న విజయవాడ, మంగళగిరిలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విజయవాడ వించిపేటలో షాజహూర్ ముసాఫిర్ ఖానా, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం ముస్లిం మతపెద్దలతో సమావేశం కానున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అదే రోజు, మంగళగిరిలో గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టీనా కుమారుడి పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు.
CM Jagan
Vijayawada
Mangalagiri
YSRCP

More Telugu News