Telangana: వివాహితను లైంగికంగా వేధించిన టీఆర్ఎస్ నేతకు మహిళల దేహశుద్ధి

Women Attacked trs leader for abusing woman
  • జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన
  • మనస్తాపంతో బ్లేడుతో చేయి కోసుకున్న బాధితురాలి భర్త
  • గంగాధర్‌గౌడ్‌ను చితకబాదిన కాలనీ మహిళలు
ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న టీఆర్ఎస్ నేతకు మహిళలందరూ కలిసి దేహశుద్ధి చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కల్లూరు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆకుల గంగాధర్‌గౌడ్ తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఓ వివాహిత తన భర్తకు చెప్పింది. తన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఆమె చెప్పింది విని మనస్తాపానికి గురైన భర్త బ్లేడుతో చేయి కోసుకున్నాడు. విషయం తెలిసిన కాలనీ మహిళలు నిన్న గంగాధర్‌గౌడ్ ఇంటికి వెళ్లారు. అతడిని పట్టుకుని అందరూ కలిసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
TRS
Jagityal
Korutla

More Telugu News