29న ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
- ఎల్బీ స్టేడియంలో సీఎం ఇఫ్తార్ విందు
- మైనారిటీల అభివృద్ధి కోసం పథకాల అమలు
- లౌకిక వాదాన్ని కాపాడటంలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నకేసీఆర్
ఈ సందర్భంగా తెలంగాణలో మత సామరస్యం ఫరిడవిల్లుతున్న వైనాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. "తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్ కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది" అని కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.