ఉత్సాహంగా 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్... హాజరైన రాజమౌళి

23-04-2022 Sat 21:45 | Both States
  • చిరంజీవి, కొరటాల కాంబోలో ఆచార్య
  • యూసఫ్ గూడ పోలీస్ మైదానంలో ప్రీ రిలీజ్ వేడుక
  • పోటెత్తిన మెగా అభిమానులు
Acharya pre release event begins
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటోంది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ బెటాలియన్ మైదానంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శ్రీనివాస్, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో నిర్మాతలు దానయ్య, ప్రసాద్, సినీ రచయిత బీవీఎస్ రవి, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తదితరులు ఉన్నారు.