SRH: నిప్పులు చెరిగిన సన్ రైజర్స్ బౌలర్లు.... 68 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు

  • టాస్ గెలిచిన సన్ రైజర్స్
  • బెంగళూరుకు మొదట బ్యాటింగ్
  • 16.1 ఓవర్లలోనే చాప చుట్టేసిన వైనం
  • మార్కో జాన్సెన్, నటరాజన్ లకు మూడేసి వికెట్లు
  • రెండు వికెట్లతో రాణించిన జగదీశ సుచిత్
RCB collapsed after SRH bowlers sensational spell

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతమైన బంతులతో కదం తొక్కిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టోర్నీలోనే అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మార్కో జాన్సెన్ విశ్వరూపం ప్రదర్శించి 3 వికెట్లు తీయడంతో మొదలైన బెంగళూరు పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. 

జాన్సెన్ కు తోడు నటరాజన్ (3 వికెట్లు), జగదీశ సుచిత్ (2 వికెట్లు), ఉమ్రాన్ మాలిక్ (1 వికెట్), భువనేశ్వర్ కుమార్ (1 వికెట్) కూడా రాణించడంతో బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్ లో ఓపెనర్ అనుజ్ రావత్, కోహ్లీ, దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యారు. ఐపీఎల్ తాజా సీజన్ లో ఓవైపు భారీ స్కోర్లు నమోదవుతున్న దశలో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటతీరు అందరినీ విస్మయానికి గురిచేసింది.

More Telugu News