Puvvada Ajay Kumar: పీజీ మెడిక‌ల్ సీట్ల బ్లాక్ దందాపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ వివ‌ర‌ణ ఇదే

minister puvvada ajay kumar comments on pg medical seats blocking
  • నాపై గ‌వ‌ర్న‌ర్‌కు త‌ప్పుడు ఫిర్యాదు
  • రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు పూర్తిగా నిరాధారం
  • సీట్లు బ్లాక్ చేయాల్సిన అవ‌స‌రం మాకు లేదు
  • త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న పువ్వాడ‌
పీజీ మెడిక‌ల్ సీట్ల కేటాయింపులో సీట్ల‌ను బ్లాక్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తాజాగా స్పందించారు. పీజీ మెడిక‌ల్ సీట్ల‌ను బ్లాక్ చేసి దందా సాగించానంటూ త‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా నిరాధార‌మ‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాకుండా ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే త‌న కాలేజీని ప్ర‌భుత్వానికి రాసిస్తాన‌ని కూడా ఆయ‌న స‌వాల్ విసిరారు. 

ఈ సంద‌ర్భంగా పువ్వాడ అజ‌య్ క‌మార్ ఏమన్నారంటే... "పీజీ మెడిక‌ల్ సీట్ల బ్లాక్ దందాకు సంబంధించి నాపై గ‌వ‌ర్న‌ర్‌కు త‌ప్పుడు ఫిర్యాదు చేశారు. సీట్లు బ్లాక్ చేయాల్సిన అవ‌స‌రం మాకు లేదు. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు పూర్తిగా నిరాధారం. ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే నా కాలేజీని ప్ర‌భుత్వానికి రాసిస్తా. నిరూపించ‌లేక‌పోతే రేవంత్ ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెబుతారా? కాలేజీ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వు" అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు.
Puvvada Ajay Kumar
PG Medical Seats
TRS
Congress
Revanth Reddy

More Telugu News