Pawan Kalyan: పడిపోయిన పోలీసు అధికారిని పైకిలేపిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan helps Police Officer who fell down
  • జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
  • పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్
  • చింతలపూడిలో రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
  • పవన్ రాకతో భారీ కోలాహలం
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చింతలపూడిలో ఆర్థికసాయం అందజేశారు. కాగా, పవన్ పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. పవన్ వస్తున్నారని తెలియడంతో భారీగా జనసందోహం తరలివచ్చింది. పోలీసులకు వారిని అదుపు చేయడం చాలా కష్టమైపోయింది. 

పవన్ రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా, రోప్ పార్టీ పోలీసులు జనాన్ని నియంత్రించేందుకు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తోపులాట కారణంగా ఓ పోలీసు అధికారి రోడ్డు పక్కకు పడిపోయారు. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ ఆ పోలీసు అధికారిని చేయిపట్టుకుని పైకిలేపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Pawan Kalyan
Police Officer
Chintalapudi
West Godavari District
Janasena

More Telugu News