Bonda Uma: విచారణకు రమ్మంటూ బోండా ఉమ‌కు నోటీసులు అందజేసిన మహిళా కమిషన్ ప్రతినిధులు

ap womens commission issues notices to tdp leader bonda uma maheswara rao
  • విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో గ్యాంగ్ రేప్‌
  • బాధితురాలి ప‌రామ‌ర్శ సంద‌ర్భంగా మ‌హిళా క‌మిష‌న్‌కు అవ‌మానం జరిగిందంటూ ఆరోపణ 
  • 27న బోండా ఉమ‌ కమిషన్ ఆఫీసుకు రావాలంటూ నోటీసులు 
  • క‌మిష‌న్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం నోటీసుల జారీ
విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో జ‌రిగిన సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌కు సంబంధించి చోటుచేసుకున్న ప‌రిణామాల నేపథ్యంలో రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ను బెదిరించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు మ‌హిళా కమిష‌న్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసు కాపీని ఉమ‌కు ఆయ‌న ఇంటిలోనే మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌తినిధులు అందించారు. 

ఈ నెల 27న ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిష‌న్ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నోటీసుల్లో ఉమ‌ను మ‌హిళా క‌మిష‌న్ కోరింది. విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో జ‌రిగిన సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌లో బాధితురాలి ప‌రామ‌ర్శ సంద‌ర్భంగా మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ను అవ‌మానించారని స‌ద‌రు నోటీసుల్లో ఉమ‌కు క‌మిష‌న్ తెలిపింది. ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం క‌మిష‌న్‌ ఈ నోటీసులు జారీ చేసింది.
Bonda Uma
AP Womens commission
TDP

More Telugu News