Kolkata Kingth Riders: కోల్‌కతాపై టాస్ నెగ్గిన గుజరాత్.. పాండ్యా ఈజ్ బ్యాక్!

 IPL 2022 Gujarat Titans opt to bat
  • ఈ మ్యాచ్‌లో గెలిస్తే అగ్రస్థానానికి టైటాన్స్
  • ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా
  • మూడు మార్పులతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా
  • అందుబాటులోకి వచ్చేసిన టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్- గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనుండగా, రాత్రి ఏడున్నర గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడతాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైటాన్స్.. ప్రత్యర్థి కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. కోల్‌కతా ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని నైట్ రైడర్స్ పట్టుదలగా ఉంది. 

గుజరాత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. విజయ్‌ బెంచ్‌కు పరిమితమయ్యాడు. కోల్‌కతా జట్టులో మూడు మార్పులు జరిగాయి. టిమ్ సౌథీ, శామ్ బిల్లింగ్స్, రింకు సింగ్ జట్టులోకి వచ్చారు.
Kolkata Kingth Riders
Gujarat Titans
IPL 2022

More Telugu News