Bopparaju Venkateswarlu: అవినీతి, అవినీతి అంటున్నారు.. ఏ వ్యవస్థలో లేదో చెప్పండి: ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు

bopparaju strong response on Corruption in Revenue departmet
  • పదేపదే అవినీతి అనడం సరికాదన్న బొప్పరాజు
  • సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను శుద్ధంగా ఉండమంటే ఎలా అని నిలదీత
  • 25న ప్రభుత్వంతో జరిగే సమావేశంలో పీఆర్సీ జీవోలపై ప్రశ్నిస్తామన్న బొప్పరాజు
ఏపీ రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పదేపదే అంటున్నారని, ఏ వ్యవస్థలో అవినీతి లేదో చెప్పాలని ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సౌకర్యాల లేమి, వసతుల కొరతపై దృష్టిపెట్టడం మాని పదేపదే అవినీతి అంటూ ప్రచారం చేయడం ఏం బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులను శుద్ధంగా ఉండమంటే ఎలా అని నిలదీశారు. 

గుడివాడలో ఆర్‌ఐపై ఇసుక మాఫియా దాడి గురించి బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం సరికాదని అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిపై అందరూ తమను దోషులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న ప్రభుత్వంతో జరగనున్న సమావేశంలో పీఆర్సీపై జీవోల జారీ గురించి ప్రశ్నిస్తామని బొప్పరాజు తెలిపారు.
Bopparaju Venkateswarlu
Andhra Pradesh
Revenue

More Telugu News