భర్తకు తొలి వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్పిన గుత్తా జ్వాల
- ఏడాది క్రితం విష్ణు విశాఖతో గుత్తా రెండో వివాహం
- శుక్రవారం రాత్రి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలు
- సోషల్ మీడియాలో ఫొటోను పోస్ట్ చేసిన గుత్తా జ్వాల
భర్త గారికి తొలి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్రేమతో పేర్కొన్న జ్వాల... బాధ్యత కలిగిన, బాగా చూసుకునే భార్య దొరికిన భర్తగా తమరు భావిస్తున్నారని చెప్పగలను అంటూ తమ వివాహ బంధంపై ఆసక్తికర కామెంట్ చేశారు. గుత్తా చెప్పిన మాట నిజమేనన్నట్లుగా గుత్తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ పేరిట విష్ణు విశాల్ తీసిన సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.