Somu Veerraju: ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయి: సోము వీర్రాజు ఆగ్రహం

  • ఛానల్‌ నిర్వహణ బాధ్య‌త‌లు రాజకీయ నాయకుల చేతుల్లో ఎందుకని ‌ప్రశ్నించిన వీర్రాజు 
  • తిరుమ‌ల‌లో భక్తులకు వసతులు కల్పించాల‌ని డిమాండ్ 
  • భక్తులు ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్ర‌హం
somu veerraju slams  ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. తిరుపతిలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయని విమర్శించారు. ఛానల్‌ నిర్వహణ బాధ్య‌త‌లు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండ‌డం ఎందుకు అని ఆయ‌న నిల‌దీశారు.  

తిరుమ‌ల‌లో భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదేన‌ని, భక్తులు ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయ‌న అన్నారు. తిరుమలకు సంబంధించి ముఖ్య‌మైన‌ నిర్ణయాలు తీసుకునే ముందు అందరితో చర్చించాలని అన్నారు. ధర్మ ప్రచారానికి టీటీడీ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తున్నారో చెప్పాల‌ని, ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయని ఆయ‌న అన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత బోర్డ్‌ది మాత్ర‌మే కాదని, ఆ బాధ్య‌త‌ ప్రభుత్వానికి కూడా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ వేదపాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఏపీలో ప్రభుత్వ అక్రమాలపై నిల‌దీసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఏపీలో ఇసుక మాఫియా ఆగ‌డాలు అధిక‌మ‌య్యాయ‌ని, సత్యవేడు, కాళహస్తి, సూళ్లూరుపేట నుంచి ఇసుక‌ను చెన్నైకు తరలిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఏపీ నుంచి తమిళనాడుకు ఇసుక అక్రమ రవాణాను అరిక‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News