KTR: వైఎస్ షర్మిల పార్టీపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

KTR interesting comments on YS Sharmila party YSRTP
  • ఏ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చంటూ కేటీఆర్ కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న
  • రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న కేటీఆర్
  • షర్మిల పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని వ్యాఖ్య
తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల... పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన ఆమె రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రజలను నేరుగా కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోందని... అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. 

మరోవైపు షర్మిల పార్టీపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా... రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని... వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని చెప్పారు.
KTR
TRS
YS Sharmila
YSRTP

More Telugu News