Nadendla Manohar: ధర్మాజీపేట వద్ద రోడ్డు తవ్వకాన్ని అడ్డుకున్న నాదెండ్ల మనోహర్

Nadendla Manohar obstructs road works at Dharmajipeta
  • రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన
  • కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
  • పవన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల
  • ధర్మాజీపేట వద్ద జేసీబీతో రోడ్డు పనులు
  • పవన్ పర్యటన అడ్డుకునేందుకే అంటూ ఆగ్రహం
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 23న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని జనసేన పార్టీ ఆరోపించింది. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి వస్తున్నారు. 

అయితే, చింతలపూడి నియోజకవర్గంలోని ధర్మాజీపేట వద్ద ఆర్ అండ్ బీ రహదారిని అడ్డంగా తవ్వేస్తున్నారంటూ జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళుతున్న నాదెండ్ల మనోహర్ మార్గమధ్యంలో ధర్మాజీపేట వద్ద రోడ్డు తవ్వేస్తుండడాన్ని గమనించి, అడ్డుకున్నారు. పవన్ వస్తున్నందునే జేసీబీతో అప్పటికప్పుడు తవ్వకాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. రహదారి పనుల ముసుగులో పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
.
Nadendla Manohar
Dharmajipeta
Road Works
Pawan Kalyan
West Godavari District
Janasena

More Telugu News