‘మహీంద్రా’లో మహీ ఉంది.. ధోనీకి ఆనంద్ మహీంద్రా ప్రత్యేక అభినందనలు
- మహీంద్రాలో మహీ అక్షరాలను గుర్తు చేసిన ఆనంద్ మహీంద్రా
- సంతోషంగా ఉందంటూ మహీంద్రా కామెంట్
- అద్భుతమైన ముగింపు అంటూ ట్వీట్
- చక్కటి ట్వీట్ తో స్పందించిన సీఎస్కే
ముంబైపై చెన్నై విజయానికి సాధించాల్సిన పరుగులతో పోలిస్తే ఉన్న బంతులు తక్కువ. అయినా ధోనీ ప్రశాంతంగా క్రీజులో ఉండి చివరి ఓవర్ లో చెలరేగి పోవడం తెలిసిందే. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు భారీగా లైక్ లు పడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సైతం మహీంద్రాకు ధన్యవాదాలు చెబుతూ అద్భుతంగా స్పందించింది. మనలో ఆనంద్ ఉన్నాడంటూ ట్వీట్ పెట్టింది.