వేసవిలో మధుమేహులు తీసుకోదగిన పానీయాలు.. ఆహారం

  • శరీరంలో తగినంత నీటి పరిమాణం ఉండాలి
  • ఇది తగ్గితే రక్తంలో గ్లూకోజ్ స్థాయులపై ప్రభావం
  • తాజా ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి
  • శారీరక వ్యాయామం కూడా అవసరమే
Best drinks fruits vegetables for people with diabetes in summer

మధుమేహం నియంత్రణ అన్నది ఆహారం, శారీరక వ్యాయామంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో శరీరంలో నీటి పరిమాణం తగ్గకుండా, అదే సమయంలో రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఫుడ్, న్యూట్రిషనల్ నిపుణుల సూచనల ప్రకారం..

కొబ్బరి నీరు చాలా మంచిది. అలాగే చక్కెర వేయని నిమ్మరసం, హెర్బల్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, కుకుంబర్ (కీరదోస) జ్యూస్ మంచివి. ఇవి రక్తంలో గ్లూకోజ్ పెరిగేందుకు కారణం కావు. రక్తంలో నీటి పరిమాణం తగ్గడం కూడా గ్లూకోజ్ స్థాయులను ప్రభావితం చేస్తుంది. నీరు అన్నది జీర్ణక్రియకు, కీళ్లలో కదలికలకు కూడా అవసరమే. నీటి శాతం తగ్గితే శారీరక కదలికలు కూడా తగ్గుతాయి. మెదడు పనితీరుపైనా ప్రభావం పడుతుంది.

పాలకూర, కాలీఫ్లవర్, బీన్స్ తీసుకోవచ్చు. పిండి పదార్థాలు తక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవాలి. దీనికితోడు కొంత వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. బ్రెడ్డు, రైస్, ఆలుగడ్డల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను పెంచుతాయి. పీచు ఉండి, ఆకుపచ్చగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది.

ఇక పండ్లలో స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, కమలా/నారింజ పండ్లు, ప్లమ్స్, పియర్స్ తీసుకోవచ్చు. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. తాజా పండ్లలో ఎక్కువ శాతం రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగేందుకు కారణం కావు.

More Telugu News