CBI: సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ కోరుతూ... తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిష‌న్‌

bjp files petition in ts high court seeking cbi enquiry into sai ganesh suicide
  • ఖ‌మ్మంలో బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌
  • టీఆర్ఎస్‌, పోలీసుల వేధింపులే కార‌ణ‌మంటున్న బీజేపీ
  • ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ‌కు డిమాండ్‌
ఖ‌మ్మం బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్యపై సీబీఐ విచార‌ణకు ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ తెలంగాణ హైకోర్టులో శుక్ర‌వారం పిటిష‌న్ దాఖ‌లైంది. బీజేపీ తెలంగాణ శాఖ నేత‌లు ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. అధికార టీఆర్ఎస్ నేత‌లు, పోలీసుల వేధింపులు తాళ‌లేక సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఆత్మ‌హ‌త్య‌కు ముందు కూడా సాయి గ‌ణేశ్ ఇదే విష‌యాన్ని మీడియాకు తెలిపార‌ని కూడా బీజేపీ నేత‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌కు దారి తీసిన కార‌ణాల‌పై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కే తెలంగాణ బీజేపీ నేత‌లు సీబీఐ విచార‌ణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
CBI
TS High Court
BJP
Khammam
Sai Ganesh

More Telugu News