Mumbai Indians: ఏడు మ్యాచుల్లో ఓడిన ముంబై పేరున అతి చెత్త రికార్డు!

Mumbai Indians record worst ever start to an IPL season by any team
  • ఢిల్లీ, బెంగళూరు జట్ల చెత్త రికార్డును అధిగమించిన ముంబై
  • వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన తొలి జట్టుగా అన్‌వాంటెడ్ రికార్డు
  • మూసుకుపోయిన ప్లే ఆఫ్స్ అవకాశాలు
చెన్నై సూపర్ కింగ్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్ ఖాతాలో అతిచెత్త రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేర్లపై ఉండగా, ఇప్పుడా రికార్డును ముంబై బద్దలుగొట్టింది.

2013లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తొలి ఆరు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. 2019లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఆరు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో జట్లు ఇలా వరస ఓటుములు ఎదుర్కోవడం ఇది 11వసారి కావడం గమనార్హం. 

అయితే, ఐపీఎల్‌ టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబైకి మాత్రం ఇదే తొలిసారి. ఏడు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు బోణీ కొట్టలేకపోయిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. ముంబై కనుక ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి ఈసారి ముంబై ఈసారి లీగ్ దశ నుంచే ఇంటి ముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Mumbai Indians
Chennai Super Kings
IPL 2022

More Telugu News