Andhra Pradesh: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు పొడిగింపు

Extension of services of contract employees in AP
  • వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగింపు
  • 16 శాఖ‌ల్లోని కాంట్రాక్టు సిబ్బందికి వ‌ర్తింపు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వీరి సేవ‌ల‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవ‌ల‌ను పొడిగించింది.

పాఠశాల విద్య‌, ఉన్నత విద్య‌, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆ ఉత్త‌ర్వుల్లో ఆర్ధిక శాఖ వెల్లడించింది.
Andhra Pradesh
Finance Department
Contract Employees

More Telugu News