TDP: అనంత‌పురంలో బుద్ధా వెంక‌న్న‌పై కేసు న‌మోదు

police case registered on budda venkanna in ananthapur
  • చంద్ర‌బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా బుద్ధా కీల‌క వ్యాఖ్య‌లు
  • 100 మందితో ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేశామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • అనంత పోలీసుల‌కు మండ‌లి విప్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు
టీడీపీ సీనియ‌ర్ నేత‌ బుద్ధా వెంక‌న్న‌పై అనంత‌పురంలో పోలీసు కేసు న‌మోదైంది. బుధ‌వారం నాడు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఉద్వేగానికి గురైన బుద్ధా వెంక‌న్న‌.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తే స‌హించేది లేద‌ని, చంద్ర‌బాబు ర‌క్ష‌ణ కోసం 100 మందితో ఆత్మాహుతి ద‌ళాన్ని సిద్ధం చేశామ‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  

ఈ వ్యాఖ్య‌ల‌ను ఆధారం చేసుకుని బుద్ధాపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఏపీ శాస‌న‌మండ‌లిలో విప్‌గా ఉన్న గోపాల్ రెడ్డి గురువారం అనంత‌పురం వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బుద్ధా వెంక‌న్న‌పై కేసు నమోదు చేశారు.
TDP
Budda Venkanna
Anantapur
Gopal Reddy

More Telugu News