Devulapalli Prabhakar Rao: తెలంగాణ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు దేవుల‌ప‌ల్లి ప్రభాకర్ రావు మృతి

telangana Official Language Commission Chairman devulapalli passes away
  • తెలుగు సాహిత్యంలో ప్ర‌త్యేక ముద్ర‌
  • తెలంగాణ ఉద్య‌మంలో చురుకైన పాత్ర‌
  • 2016లో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడిగా ఎంపిక   
  • దేవుల‌ప‌ల్లి ప‌ద‌వీకాలాన్ని పొడిగిస్తూ వ‌చ్చిన కేసీఆర్‌
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (83) గురువారం మృతి చెందారు. తెలుగు సాహిత్యంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవుల‌ప‌ల్లి... తెలంగాణ ఉద్య‌మంలోనూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. దేవుల‌ప‌ల్లికి మంచి గుర్తింపు నిచ్చారు.

2016లో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్య‌క్షుడిగా దేవుల‌ప‌ల్లిని కేసీఆర్ నియ‌మించారు. ఆ త‌ర్వాత ఆయన ప‌ద‌వీ కాలాన్ని తెలంగాణ స‌ర్కారు పొడిగిస్తూ వ‌స్తోంది. ఆ ప‌ద‌విలో కొన‌సాగుతూనే గురువారం దేవుల‌ప‌ల్లి మృతి చెందారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.
Devulapalli Prabhakar Rao
Telangana
Telangana Official Language Commission Chairman

More Telugu News