Road Accident: కారు ఢీకొట్ట‌డంతో ఫ్లై ఓవ‌ర్ నుంచి కింద ప‌డ్డ బైక్‌...దంప‌తులు స‌హా చిన్నారి మృతి

three people died in a accident in kodad
  • కోదాడ స‌మీపంలోని గుడిబండ ఫ్లై ఓవ‌ర్‌పై ప్ర‌మాదం
  • ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి బైక్‌పై వెళుతున్న దంప‌తులు
  • ఇద్ద‌రు చిన్నారులకు తీవ్ర గాయాలు, ఆసుప‌త్రికి త‌ర‌లింపు
తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లాలో గురువారం సాయంకాలం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోదాడ మండలం నల్లబండగూడెంకు చెందిన బోయల శ్రీనివాస్, అతని భార్య నాగమణి, చిన్న కూతురు ఉషశ్రీ  మృతి చెందారు. 

సూర్యాపేట జిల్లా కోదాడ స‌మీపంలోని గుడిబండ ఫ్లై ఓవ‌ర్‌పై శ్రీనివాస్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై వెళుతుండ‌గా... వేగంగా దూసుకువ‌చ్చిన కారు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఫ్లై ఓవ‌ర్ పై నుంచి బైక్ కింద ప‌డింది.

ఈ ప్ర‌మాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, మార్గమధ్యంలో చిన్న కూతురు, ఆసుపత్రిలో భార్య నాగమణి మృతి చెందారు. మిగిలిన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వారికి ప్రస్తుతం కోదాడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉన్న‌ట్లు స‌మాచారం.
Road Accident
Suryapet District
Kodad
Fly Over

More Telugu News