Yash: నాకు ఈ హీరోయిన్ తో నటించాలని ఉంది: యష్

My favourite heroine is Deepika Padukone says Yash
  • తన ఫేవరెట్ హీరోయిన్ దీపిక పదుకుణే  అని చెప్పిన యష్
  • దీపిక నటన ఎంతో బాగుంటుందని కితాబు
  • ఆమె సినిమాలను చూస్తుంటానన్న యష్
ఇప్పుడు ఎక్కడ చూసినా 'కేజీఎఫ్ 2' గురించిన చర్చే నడుస్తోంది. భారీ ప్రమోషన్లు చేయకుండానే ఈ సినిమా దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 700 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఈ చిత్రంతో కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

మరోవైపు ఓ ఇంటర్వ్యూలో యష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తన ఫేవరెట్ హీరోయిన్ దీపిక పదుకుణే అని చెప్పాడు. ఆమెతో కలిసి నటించాలనేది తన కోరిక అని తెలిపాడు. దీపిక నటన ఎంతో బాగుంటుందని చెప్పాడు. ఆమె నటించే సినిమాలను చూస్తుంటానని అన్నాడు. 
Yash
KGF 2
Deepika Padukone

More Telugu News