Jagan: రేపు ఒంగోలు పర్యటనకు వెళ్తున్న జగన్.. షెడ్యూల్ వివరాలు ఇవిగో!

Jagan going to Ongole tomorrow
  • సున్నా వడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
  • పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమం
  • అనంతరం రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి వెళ్లనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఒంగోలు పర్యటనకు వెళ్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన అక్కడ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలిప్యాడ్ వద్దకు బయల్దేరుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 10.10 గంటలకు ఒంగోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఏబీఎం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 

అనంతరం ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. అక్కడే సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు. రవి శంకర్ కుటుంబంలో ఇటీవల పెళ్లి అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమై మధ్యాహ్నం 1.05 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
Jagan
YSRCP
Ongole

More Telugu News