Telangana: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కార్య‌క్ర‌మంలో గుండెపోటుతో అటెండ‌ర్ మృతి

telangana governor attender died due cardianc arrest
  • స్కంధ‌గిరి ఆల‌య ప్ర‌తిష్ఠ‌కు హాజ‌రైన గ‌వ‌ర్న‌ర్‌
  • గ‌వ‌ర్నర్ వెంట కార్య‌క్ర‌మానికి వెళ్లిన అటెండ‌ర్ రాజు
  • ప్ర‌తిష్ఠ స‌మ‌యంలోనే గుండెపోటుకు గురైన రాజు
  • ఆసుపత్రికి త‌ర‌లించేలోగానే మృతి చెందిన వైనం
తెలంగాణ గ‌వర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పాల్గొన్న ఓ కార్య‌క్ర‌మంలో విషాదం చోటుచేసుకుంది. కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ వెంట వెళ్లిన అటెండ‌ర్ రాజు గుండెపోటుకు గుర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్‌లోనే గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగానే ఆయ‌న మృతి చెందారు. గురువారం నాడు సికింద్రాబాద్ ప‌రిధిలోని ప‌ద్మారావు న‌గ‌ర్ స్కంధ‌గిరి టెంపుల్‌ వద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... స్కంధ‌గిరి ఆల‌యంలో విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై హాజ‌ర‌య్యారు. గవ‌ర్న‌ర్ వెంట అటెండ‌ర్ రాజు కూడా అక్క‌డికి వెళ్లారు. ఆల‌యంలో విగ్ర‌హ ప్ర‌తిష్ట జ‌రుగుతున్న స‌మ‌యంలోనే రాజు గుండెపోటుకు గుర‌య్యారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఆయ‌న‌ను గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్‌లోనే స‌మీపంలోని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు గాంధీ ఆసుప‌త్రి వైద్యులు ప్రకటించారు.
Telangana
TS Governor
Tamilisai Soundararajan

More Telugu News