Hyderabad: ఈదురు గాలులు, వ‌ర్షం... హైద‌రాబాద్‌లో చ‌ల్ల‌బ‌డ్డ వాతావ‌ర‌ణం

due to rain in hyderabad climate changed
  • న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం
  • బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌, ఎస్ఆర్ న‌గ‌ర్‌ల‌లో భారీ వ‌ర్షం
  • హ‌య‌త్ న‌గ‌ర్, ఎల్బీ న‌గ‌ర్‌, నాగోల్‌, వ‌న‌స్థ‌లిపురంల‌లో ఓ మోస్త‌రు వ‌ర్షం
హైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం గురువారం సాయంత్రం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. న‌గ‌రంలోని బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌, ఎస్ఆర్ న‌గ‌ర్‌ల‌లో భారీ వ‌ర్షం కుర‌వ‌గా... హ‌య‌త్ న‌గ‌ర్, ఎల్బీ న‌గ‌ర్‌, నాగోల్‌, వ‌న‌స్థ‌లిపురంల‌లో ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో వ‌ర్షం పెద్ద‌గా లేకున్నా.. ఈదురు గాలులు వీచాయి. ఫ‌లితంగా న‌గ‌రంలో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది.  
Hyderabad
Telangana
Rain

More Telugu News