సబర్మతీ ఆశ్రమంలో చరఖాతిప్పి నూలు వడికిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్.. వీడియో ఇదిగో

21-04-2022 Thu 12:03
  • భారత పర్యటన‌లో బ్రిట‌న్ ప్ర‌ధాని 
  • స‌బ‌ర్మ‌తీ ఆశ్రమంలో కాసేపు గ‌డిపిన జాన్స‌న్
  • విజిట‌ర్స్ పుస్త‌కంలో త‌న అనుభ‌వాన్ని రాసిన బోరిస్
  • స‌బ‌ర్మ‌తీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్య‌
Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram
భారత పర్యటనకు వచ్చిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. సబర్మతీ ఆశ్రమంలో ఆయ‌న కాసేపు గ‌డిపి చరఖాతిప్పి నూలు వడికారు. చ‌ర‌ఖాను ఎలా తిప్పాలో ఆశ్ర‌మంలోని మ‌హిళ‌లు ఆయనకు వివరించారు.  

విజిట‌ర్స్ పుస్త‌కంలో ఆయ‌న త‌న అనుభ‌వాన్ని రాశారు. స‌బ‌ర్మ‌తీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చ‌డానికి మ‌హాత్మా గాంధీ సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలతో ఎలా పోరాడారో తాను అర్థం చేసుకున్నాన‌ని చెప్పారు.