Hyderabad: సొంత యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారం... తమిళనాడు వ్యక్తికి హైదరాబాద్ పోలీసుల అరదండాలు

Tamil Nadu Man lives IPl Matches with own app arrested
  • స్టార్ ఇండియా ప్రతినిధి లింకును దొంగిలించి ఐపీఎల్ ప్రసారాలు
  • తమిళనాడులోని శివగంగై వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • అక్కడి కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం నగరానికి..
సొంతంగా ఓ యాప్‌ను తయారుచేసి దాని ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న వ్యక్తికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరదండాలు వేశారు. వారి కథనం ప్రకారం.. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన స్టార్ ఇండియా ప్రతినిధి కదరామ్ తుప్పా ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. గుర్తు తెలియని వ్యక్తులు తమ లింకును దొంగిలించి ఓ యాప్ ద్వారా క్రికెట్‌‌ను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఈ యాప్‌ను తమిళనాడులోని శివగంగై జిల్లా నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీంతో నాలుగు రోజుల క్రితం తమిళనాడు వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులు శివగంగై సమీపంలోని కాంజిరంగల్‌లోని పిల్లైయార్ కోయిల్ వీధిలో ఉంటున్న రామమూర్తి (29)ని అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం నిన్న హైదరాబాద్ తీసుకొచ్చారు.
Hyderabad
Cyber Crime
IPL 2022
Star India

More Telugu News